Home South Zone Andhra Pradesh అమరావతి లో ఆశా కార్య కర్తల సమావేశం

అమరావతి లో ఆశా కార్య కర్తల సమావేశం

0

విశాఖ నగరంలోని మధురవాడ యందు గల అమరావతిలో మంగళవారం ఉదయం 10గంటలకు  ప్రాథమిక అరోగ్య కేంద్రంలో 8మంది ఆశా కార్య కర్తలకు .8మంది ఏ ఎన్ ఎం లకు సమా వేశం జరిగింది. సమావేశంలో డాక్టర్ సాల్మన్ రాజు మాట్లాడుతూ మన పీ హె చ్ సి పరిధి లో ఆశా కార్య కర్తలు ఇల్లు ఇల్లు తిరిగి గర్భిణుల ను గుర్తించి వారికి సరైన సలహాలు ఇవ్వడం.

హెల్త్ కార్డులు ఇవ్వడం. వాటి వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని కోరారు అంతే కాకుండా ఏ ఎన్ ఎం లు  పరిధిలోని ప్రజలకు షుగర్. బి పీ. చెక్ చేసి మందులు ఇవ్వాలన్నారు. నెలలో ప్రతి మంగళ వారం జరగాల్సిన సమావేశం వాయిదా పడిందన్నారు. అందుకే ఈ రోజు సమావేశం అయ్యా మని . రూరల్ ఏరియా లో ప్రజల ఆరోగ్య సమస్యలు పట్ల జాగ్రత్త ఉండి వారిని ఆసుపత్రులకు రెఫర్ చేయాలన్నారు. ఈసమావేశంలో హెల్త్ సూపర్ వైజర్ లక్ష్మి గారు. కల్యాణి గారు తది తరులు హాజరై నారు

NO COMMENTS

Exit mobile version