ఆంధ్రప్రదేశ్‌ను వ్యూహాత్మక ఖనిజాల హబ్‌గా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. మంగళవారం జరిగిన గనుల శాఖ సమీక్షలో ‘ఏపీ టైటానియం మిషన్’ ఏర్పాటుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్రంలోని బీచ్ సాండ్ మినరల్స్‌ను వినియోగించుకుని ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు అవసరమైన ఉత్పత్తులను ఇక్కడే తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
శ్రీకాకుళం, అనకాపల్లి, మచిలీపట్నంలో మూడు భారీ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదించారు. పదేళ్లలో రూ. 50 వేల కోట్ల పెట్టుబడులు, 40 వేల ఉద్యోగాలే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీ పారిశ్రామిక ముఖచిత్రం మారిపోనుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.










