మంగళవారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి (DRO) మధుసూదన్ రావు HPV టీకా ప్రచార పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ టీకా ద్వారా కౌమారదశ బాలికలను గర్భాశయ క్యాన్సర్ నుండి రక్షించవచ్చని తెలిపారు.
జిల్లాలో 14 ఏళ్ల బాలికలకు ప్రభుత్వ ఆసుపత్రులు, PHCలలో ఈ టీకాను ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రాణాంతక క్యాన్సర్‌ను నివారించడంలో ఈ టీకా ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని, తల్లిదండ్రులు తమ కుమార్తెలకు తప్పనిసరిగా టీకా వేయించాలని ఆయన కోరారు. ఆరోగ్య శాఖ అధికారులు ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు
