Home South Zone Andhra Pradesh ఘనంగా బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం

ఘనంగా బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం

0

కాకినాడ జిల్లా పెద్దాపురంలో బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. చాపల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు గ్రాడ్యుయేట్స్, దైవ సేవకులు పాల్గొన్నారు.
సమావేశంలో గతంలో మరణించిన బిబిఎస్ గ్రాడ్యుయేట్స్‌కు ఘన నివాళులు అర్పించారు. అనంతరం న్యూ జనరేషన్ చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు గుడివాడ బాబ్జి అధ్యక్షతన సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా కమిటీకి అందరూ సహకరించాలని, మరణించిన గ్రాడ్యుయేట్స్ కుటుంబాలకు కమిటీ అండగా నిలవాలని తీర్మానించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుండి విక్టర్ బాబు, ఐ. జోసెఫ్, నందిక ప్రసాద్, ఎం. లాజర్, బి.సి.హెచ్. కోటేశ్వరరావు, ఎం. రత్నం, ఎం. ఏసుపాదం, ఎం. డేవిడ్ కింగ్, కమిటీ వైస్ ప్రెసిడెంట్ కె. డేవిడ్ రాజు, వై. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సభ ఆత్మీయ వాతావరణంలో కొనసాగి, పరస్పర సహకారం మరియు సంఘ బలోపేతంపై చర్చలు జరిగాయి.

NO COMMENTS

Exit mobile version