Home South Zone Andhra Pradesh జిల్లాలో శాంతిభద్రతలు కరువు – కాకాణి పూజిత ఘాటు విమర్శలు.

జిల్లాలో శాంతిభద్రతలు కరువు – కాకాణి పూజిత ఘాటు విమర్శలు.

0

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత విమర్శించారు. నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.

జిల్లాలో మైనర్ బాలికలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు కలచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరిగొండ ఘటనలో నిజాన్ని కప్పిపుచ్చేందుకు పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది ప్రయత్నించడం దారుణమన్నారు. గంజాయి, మద్యం ప్రభావంతోనే చిన్నారుల జీవితాలు చిదిగిపోతున్నాయని మండిపడ్డారు. జగనన్న హయాంలో దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ ఉండేదని, ప్రస్తుత ప్రభుత్వం శాంతిభద్రతలను గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు.

NO COMMENTS

Exit mobile version