బాపట్ల జిల్లా: పర్చూరు నియోజకవర్గంలోని నాగులపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి–167 పనుల నేపథ్యంలో గ్రామంలోని పాఠశాలకు వెళ్లే రహదారిని మూసివేయడం సరైన చర్య కాదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.నాగులపాలెం గ్రామానికి చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు గ్రామ ప్రజలు రోజువారీ రాకపోకలకు ఈ రహదారిని వినియోగిస్తున్నారు.
అయితే ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గం లేదా డైవర్షన్ ఏర్పాటు చేయకుండా రహదారిని మూసివేయడం వల్ల విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు, గ్రామ ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏర్పడింది.అధికారులు తక్షణమే స్పందించి నాగులపాలెం వద్ద సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేసి ఆ రహదారిని జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుతో కలిపి ప్రజలకు సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే చిన్నారుల భద్రత దృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ సమస్యపై సంబంధిత అధికారులు వెంటనే దృష్టి సారించి పరిష్కారం చూపాలని, అలాగే పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కూడా స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.సమస్యపై త్వరితగతిన చర్యలు తీసుకోకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేసే పరిస్థితి ఏర్పడుతుందని గ్రామ ప్రజలు హెచ్చరిస్తున్నారు.
#Narendra










