మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో తీవ్ర మందుల కొరతను వెంటనే నివారించాలని బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఆసుపత్రి మెడికల్ సూపర్ సూపరింటెండెంట్ రమేష్‌కు వినతిపత్రం అందజేశారు.
ఆసుపత్రిలో నిబంధనల ప్రకారం 86 రకాల మందులు అందుబాటులో ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం సగం కూడా లేకపోవడం శోచనీయమని, పేద రోగులు బయట మెడికల్ షాపుల్లో మందులు కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారని పునీత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే తగినన్ని మందులను సరఫరా చేయాలని ఆయన కోరారు.










