మార్కాపురం: స్కానింగ్ సెంటర్లలో ఫీజు వివరాలు ఎక్కడ.
మార్కాపురం జిల్లా కేంద్రంలో స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. నిర్ణీత ఫీజు వసూలు చేయాల్సి ఉండగా.. ఆ సమయానికి ఎంత చెప్తే అంత ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గతంలో ACB అధికారులు దాడులు నిర్వహించి, ప్రతి స్కానింగ్ సెంటర్ వద్ద ఫీజుల వివరాలను ప్రదర్శించాలన్నారు. కానీ ఎవరు పాటించడంలేదని.. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
