మిస్సింగ్ కేసుల చేదనకు నివారణ కు వేగవంతమైన చర్యలు

0
0

ప్రకాశం జిల్లాలో మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అధికారులను ఆదేశించారు. సోమవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. అదృశ్యమైన వ్యక్తుల వివరాలను వెంటనే అన్ని స్టేషన్లకు చేరవేసి, ఆధునిక పద్ధతుల్లో ఆచూకీ కనుగొనాలన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు iRAD యాప్ వినియోగం పెంచాలని, ప్రమాద స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. అలాగే మహిళా భద్రత, ఎన్‌బీడబ్ల్యూల అమలులో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ పనితీరును మెరుగుపరిచేందుకు కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌ను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డీసీఆర్‌బీ, ఎస్బీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.