Home South Zone Andhra Pradesh సీమ అభివృద్ధిని అడ్డుకోవద్దు: జగన్ పై మంత్రి సవిత ఫైర్.

సీమ అభివృద్ధిని అడ్డుకోవద్దు: జగన్ పై మంత్రి సవిత ఫైర్.

0

పెనుకొండలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. జగన్ హయాంలో మహిళలపై జరిగిన అరాచకాలను ప్రజలు మర్చిపోలేదని, ఆయనొక మహిళా ద్రోహి అని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతుంటే, జగన్ ఓర్వలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.

ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి పథకాలతో కూటమి ప్రభుత్వం మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోందని అన్నారు. రాయలసీమ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తల్లిని, చెల్లిని గౌరవించని జగన్ కు రాజకీయాల్లో ఉండే నైతిక హక్కు లేదని సవిత పునరుద్ఘాటించారు.

NO COMMENTS

Exit mobile version