స్కౌట్ శిక్షణతో క్రమశిక్షణ, బంగారు భవిష్యత్తు: ఎమ్మెల్యే.

0
0

మదనపల్లె హోప్ మున్సిపల్ హైస్కూల్‌లో బుధవారం జరిగిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ భాష పాల్గొన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, సేవాభావాన్ని పెంపొందించడంతో పాటు సమాజంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని స్కౌట్ శిక్షణ ఇస్తుందని ఆయన తెలిపారు. హార్సిలీ హిల్స్ స్కౌట్ శిక్షణ కేంద్రం మరమ్మతులకు ₹50,000 విరాళం ప్రకటించారు.

డీఈఓ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, పాఠశాలల్లో స్కౌట్ యూనిట్లు తప్పనిసరి అని, శిక్షణ పొందిన వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంటుందని తెలిపారు.