మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బొల్లారం రైల్వే స్టేషన్ ఆధునీకరణపై స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ స్టేషన్‌ను ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకం కింద చేర్చి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని కోరుతూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి ఆయన లేఖ రాశారు.
హైదరాబాద్ ఉత్తర ప్రాంతాన్ని నగరంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ప్రధాన రవాణా కేంద్రంగా బొల్లారం స్టేషన్ ఉందని, ప్రతిరోజూ వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, పారిశ్రామిక కార్మికులు దీనిపై ఆధారపడుతున్నారని ఎంపీ వివరించారు.
ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతున్నప్పటికీ, దానికి అనుగుణంగా ప్లాట్‌ఫారమ్‌లు, వేచి ఉండే గదులు (Waiting Halls), టికెటింగ్ సౌకర్యాలు తగినంతగా లేవని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ప్రయాణికుల భద్రత, సౌకర్యార్థం ఈ స్టేషన్‌ను అమృత్ భారత్ పథకంలో చేర్చడం ద్వారా ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
ఈ అభివృద్ధి వల్ల కేవలం స్థానికులకే కాకుండా, హైదరాబాద్ రీజియన్‌లోని రైల్వే నెట్‌వర్క్ మరింత బలపడుతుందని ఈటల రాజేందర్ తన లేఖలో స్పష్టం చేశారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలోని రైల్వే సమస్యల పరిష్కారానికి తాము నిరంతరం కృషి చేస్తామని, కేంద్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
#sidhumaroju
Alwal









