Home South Zone Telangana యుద్ధప్రాతిపదికన డ్రైనేజ్ పనులు పూర్తి చేయాలి.. ఎండికి మాజీ కార్పొరేటర్ విజ్ఞప్తి .|

యుద్ధప్రాతిపదికన డ్రైనేజ్ పనులు పూర్తి చేయాలి.. ఎండికి మాజీ కార్పొరేటర్ విజ్ఞప్తి .|

0

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలో తాగునీరు మరియు డ్రైనేజీ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి చొరవ తీసుకున్నారు.
శుక్రవారం ఆమె హైదరాబాద్ జలమండలి (HMWSSB) మేనేజింగ్ డైరెక్టర్ (MD) అశోక్ రెడ్డి ని మర్యాదపూర్వకముగా కలిశారు.
ఈ భేటీలో అల్వాల్‌లో పెండింగ్‌లో ఉన్న తాగునీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల (Sewerage) పనులతో పాటు, ఇప్పటికే మంజూరైన వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఆమె సుదీర్ఘంగా చర్చించారు.
పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎండీని కోరారు.
ముఖ్యంగా సంపత్ చిత్తారి కాలనీ మరియు బండబస్తీ వాసుల తాగునీటి కష్టాలను తీర్చడానికి కొత్త వాటర్ లైన్ మంజూరు చేయాలని కోరుతూ ఈ సందర్భంగా ఆమె ఎండీకి వినతి పత్రం సమర్పించారు.
మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా స్థానిక ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.
దీనికి సానుకూలంగా స్పందించిన ఎండీ అశోక్ రెడ్డి , సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
#sidhumaroju
Alwal

NO COMMENTS

Exit mobile version