గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ’ మూడో విడత నిధులను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 2,670 కోట్లను నేరుగా జమ చేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఏడాదికి ప్రతి రైతుకు రూ. 20,000 అందిస్తూ అండగా నిలుస్తున్నామని తెలిపారు. వ్యవసాయంలో ఆధునీకరణ కోసం ఏఐ అగ్రానమిస్ట్, డ్రోన్ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నామని, పోలవరం ప్రాజెక్టును వచ్చే పుష్కరాల నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అలాగే గత ప్రభుత్వ వైఫల్యాలను, లడ్డూ కల్తీ ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.










