అన్నమయ్య జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈనెల 16 (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) సుబ్రమణ్యం తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఏడాది మొత్తం 22,149 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలు మార్చి 16 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుగుతాయి. రెగ్యులర్ విద్యార్థులు 21,526 మంది కాగా, సప్లిమెంటరీ విద్యార్థులు 623 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 124 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.










