ఈ నెల 19న తెలుగు వారి కొత్త సంవత్సరం ఐన ఉగాది పండుగ పర్వ దినం కోసం బతుడెరువు కోసం విశాఖ.హైదరాబాద్.బెంగళూర్ . విజయ వాడ తదితర పట్టణాలకు వెళ్లిన వలస కార్మికులు పల్లెబాట పడుతున్నారు. పట్టణాలలో హోటల్ .ఫ్యాక్టరీలు. దిన కూలీ లు. భవన నిర్మాణం పనివారు. ప్రభుత్వ ఉద్యోగులు . ప్రైవేటు ఉద్యోగులు. సంఘటిత అసంఘటిత కార్మికులు పండుగకు వారం ముందే గ్రామాలకు చేరుకుంటున్నారు.
19.20.21.22.లలో సెలవులు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు 18 రాత్రి వారివారి గ్రా మాలకు చేరుకొని హాయిగా వారి పిల్లల మధ్య కుటుంబంతో సంతోషం తో తెలుగు సంవత్స ర ఉగాది పండుగ జరుపుకొంటారు. మళ్ళీ తిరిగి యదావిధిగా 22సాయంకాలం బయలు దేరి సోమ వారం విధులకు హాజరవుతారు. అంతేకాకుండా పై న పేర్కొన్న మిగతా వారు ఈరోజునునుంచే వారి స్వగ్రా మాలకు వెళ్లి వారి కుటుంబం మధ్యన సంతోషంగా గడపడానికి పయణమైనారు. ఏదీ ఏమైనా మార్చి నెలలో గంగ జాతర లు. పండుగలు రావడంతో . ప్రభుత్వం నెలలో 12రోజులు సెలవులు ప్రకటించింది. కార్మికులకు. ఉద్యోగస్తులకు మేలు చేకూరింది










