అన్నమయ్య జిల్లాలో 1,88,408 మంది రైతులకు మూడో విడత అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద రూ. 108.37 కోట్లు విడుదలైనట్లు జిల్లా వ్యవసాయ శాఖ జేడీ శివనారాయణ గురువారం తెలిపారు. మదనపల్లె నియోజకవర్గంలోని బీడీఎస్ ఫంక్షన్ హాల్, మొలకలదిన్నె క్రాస్ వద్ద సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు నిధుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.










