Home South Zone Andhra Pradesh నేర పరిశోధనలో మేటి: ఒంగోలు జీఆర్‌పీఎస్ పోలీసులకు ‘ABCD’ అవార్డు

నేర పరిశోధనలో మేటి: ఒంగోలు జీఆర్‌పీఎస్ పోలీసులకు ‘ABCD’ అవార్డు

0

పోలీస్ కేసుల ఛేదనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అందజేసే ప్రతిష్టాత్మక ఏ బి సి డి అవార్డులను శుక్రవారం ఘనంగా ప్రదానం చేశారు. 2025 సంవత్సరం 4వ త్రైమాసికానికి సంబంధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా ఈ అవార్డులను అందజేశారు.
మూడు రోజుల్లోనే కేసు ఛేదన రికార్డు స్థాయి రికవరీ
ఒంగోలు జీఆర్‌పీఎస్ పరిధిలో నమోదైన ఒక భారీ చోరీ కేసును అత్యంత వేగంగా ఛేదించినందుకు గాను ఈ గుర్తింపు లభించింది. క్రైమ్ నెంబర్.126/2025 యు/ఎస్ 303(2) బి.ఎన్.ఎస్ కింద నమోదైన ఈ కేసులో, నిందితుడిని కేవలం 3 రోజులలోపే అరెస్ట్ చేయడమే కాకుండా, బాధితుల నుండి దొంగిలించబడిన 341 గ్రాముల బంగారు ఆభరణాలను మరియు ఇతర విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన ఆస్తిని వెంటనే బాధితులకు అప్పగించి వారి ముఖాల్లో చిరునవ్వు నింపారు.
విజయవంతమైన బృందం పర్యవేక్షణ విజయవాడ ఎస్.ఆర్.పి రాహుల్ దేవ్ సింగ్ సమర్థవంతమైన పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ నిర్వహించబడింది. కేసు ఛేదనలో చురుకైన పాత్ర పోషించిన ఈ క్రింది అధికారులను డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఎం . మురళీధర్ డి ఎస్ ఆర్ పి నెల్లూరు, ఎస్.కె మౌలా షరీఫ్ సి.ఐ అఫ్ పోలీసులు, ఒంగోలు డి ఆర్ పి
ఎస్. హరూన్ బాషా సి.ఐ అఫ్ పోలీస్ ఆర్ సి ఆర్ పి, గుంతకల్
సిహెచ్ . కొండయ్య ఎస్సై అఫ్ పోలీస్, జి ఆర్ పి చీరాల,
కె. భాస్కర్ హెడ్ కానిస్టేబుల్
బి. రాము పోలీస్ కానిస్టేబుల్
ఈ ఆపరేషన్‌లో చీరాల ఒంగోలు పోలీస్ సిబ్బంది చూపిన సమన్వయం, చురుకైన దర్యాప్తు మరియు వేగవంతమైన చర్యలే ఈ విజయానికి కారణమని పోలీస్ ఉన్నతాధికారులు కొనియాడారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నేరస్తులను పట్టుకోవడంలో మన పోలీసులు చూపుతున్న చొరవ అభినందనీయమని డీజీపీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

NO COMMENTS

Exit mobile version