ఎర్రచందనం కేసులో తిరుపతి స్పెషల్ రెడ్ శాండిల్ కోర్టు నిందితులకు రెండేళ్ల జైలు శిక్ష విధించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 నవంబర్ లో రొంపిచర్ల పోలీసు స్టేషన్ పరిధిలో శేషాచలం అటవీ ప్రాంతం నుంచి 10 ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తూ ముగ్గురు నిందితులు పట్టుపడ్డారని తెలిపారు.
నిందితులు తేజ ప్రకాష్ రెడ్డి, గురునాథ్, శివకుమార్ కు కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 20 వేల జరిమానా విధించినట్లు తెలిపారు
# కొత్తూరు మురళి.
