మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బోలారంలోని తుర్కపల్లి జమా మసీదులో పేద ముస్లిం సోదరులకు ‘రంజాన్ తోఫా’ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు స్వయంగా కిట్లను అందజేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. పండుగ పూట ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
ఈ పంపిణీ కార్యక్రమంలో ఆమెతో పాటు ఫిరోజ్, హఫీజుల్లా, శోభన్, దేవేందర్, లోకేష్, యాదగిరి, లింగారెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal
