Home South Zone Telangana డ్రగ్స్ కట్టడికి ప్రజాపాలన… సూరారం పోలీసుల భారీ సదస్సు.|

డ్రగ్స్ కట్టడికి ప్రజాపాలన… సూరారం పోలీసుల భారీ సదస్సు.|

0

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సైబరాబాద్ సీపీ మరియు కుత్బుల్లాపూర్ డీసీపీ ఆదేశాల మేరకు సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారెడ్డి మెడికల్ కళాశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా సూరారం ఇన్స్పెక్టర్ (SHO) సుధీర్ కృష్ణ సుమారు 200 మంది విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
డ్రగ్స్ మహమ్మారి వల్ల కలిగే అనర్థాలను, అది యువత భవిష్యత్తును ఎలా చిన్నాభిన్నం చేస్తుందో వివరించారు. డ్రగ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు, మహిళల భద్రత (Women Safety) మరియు ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) ప్రోగ్రాంలో భాగంగా రోడ్డు భద్రత నియమాలపై విద్యార్థులకు ఎస్ హెచ్ ఓ సమగ్రంగా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి మెడికల్ కాలేజీ డీన్  సుమన్ చంద్ర, సూరారం ఎస్.ఐ మురళి గౌడ్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
#sidhumaroji
Alwal

NO COMMENTS

Exit mobile version