మదనపల్లెలో భవన నిర్మాణం మేస్త్రి అదృశ్యం.

0
0

మదనపల్లె పట్టణంలోని ఎస్బీఐ కాలనీకి చెందిన భవన నిర్మాణ మేస్త్రి సోమశేఖర్ శుక్రవారం నుంచి అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సోమవారం కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. సోమశేఖర్ శుక్రవారం ఉదయం పని నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి రాలేదని, బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదని భార్య షా తెలిపారు.

సోమశేఖర్ గురించి ఏవైనా వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.