అన్నమయ్య జిల్లాలో సోమవారం, మార్చి 16 నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షల కోసం పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ తెలిపారు.
ఆదివారం పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన బందోబస్తుపై కీలక ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, అనధికార వ్యక్తులు, తల్లిదండ్రులు గుమిగూడటం నిషేధమని ఆయన పేర్కొన్నారు. కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లు పరీక్షలు ముగిసే వరకు మూసి ఉంచాలని ఆదేశించారు










