ట్రాఫిక్ సమస్య పరిష్కరించడమే మా లక్ష్యం ట్రాఫిక్ ఎస్సై పవన్ కుమార్

0
1

చీరాల పట్టణంలో ప్రతిరోజు రాత్రి 7 దాటితే మున్సిపల్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ఎక్కువగా ట్రాఫిక్ సమస్య ఉండేది.ట్రాఫిక్ సమస్యకు ముఖ్య కారణం ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఆ రోడ్లో ప్యాసింజర్స్ కోసం నిలిపి ఉండటం.అందువల్ల ప్రజలు,వాహనదారులు ఎంతో ఇబ్బందిగా ప్రయాణించేవారు అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాలన్న నరకయాతన పడేవారు.

ఈ సమస్యను ప్రజలు పోలీసు వారికి తెలియజేయగా పోలీస్ సిబ్బంది స్పందించి పరిష్కరించారు. ఈ సందర్భంగా పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ చీరాల డిఎస్పి మోయిన్ ఆదేశాల మేరకు పట్టణ సీఐ సుబ్బారావు సూచనలతో టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పట్టణంలో పర్యటించి ఒక నిర్ణయం తీసుకున్నామని, ట్రాఫిక్కు సమస్య ఎక్కువ బస్సులు ఈ రోడ్లో నిలిపి ఉండటమే కారణం అని గ్రహించామని.

ఈ సమస్యను నిర్మూలించాలంటే కొన్ని బస్సులను పార్కింగ్ టిటిడి కళ్యాణ మండపం ఎదురుగా మార్చడం జరిగిందని తెలిపారు.ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్లకి తాగు సూచనలు చేసి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూడాలని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించామని తెలియజేశారు.ప్రజల క్షేమమే మాకు ముఖ్య లక్ష్యమని అన్నారు.దీంతో పట్టణంలో వాహనదారులు ప్రజలు ట్రాఫిక్ నియంత్రించిందని పోలీసు వారిని అభినందించారు.