సినీ ప్రి ప్రియులంతాయులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉగాది పండగ సందర్భంగా 19వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ అందింది. పవన్ అభిమానులకు ఈ సినిమా ఒక మరపురాని అనుభూతిగా మిగిలిపోనుందంటున్నారు.
దర్శకుడు హరీష్ శంకర్ పవన్ ను తన మార్క్ ఎలివేషన్లతో సరికొత్తగా ఆవిష్కరించారని సమాచారం.పవన్ కళ్యాణ్ ,హరీష్ శంకర్,దేవి శ్రీ ప్రసాద్,ఒకసారి బ్లాక్ బస్టర్ కొట్టిన కాంబో మళ్ళీ జతకట్టడం, దానికి తోడు సెన్సార్ నుంచి వస్తున్న సానుకూల రిపోర్టులతో ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాయి.
