చీరాల అభివృద్ధి మా కర్తవ్యం – ఎమ్మెల్యే కొండయ్య

0
1

చీరాల మండలం ఓడరేవు గ్రామంలో ఎమ్మెల్యే శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సోమవారం గ్రామంలోని వాడరేవు 1, వాడరేవు 2 నందు నూతన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ , నిర్మాణాలకు ఆయన కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య గారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు రూ.72 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ అభివృద్ధి పనులు గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాయని, వాడరేవు గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ కౌతరపు జనార్ధన్, వాడరేవు గ్రామ పార్టీ అధ్యక్షులు బందు గురవయ్య , వాడరేవు గ్రామ నాయకులు పిక్కి నారాయణ, రామకృష్ణ, తిరుపతయ్య, నరేంద్ర,అధికారులు, వివిధ హోదాలో ఉన్న నాయకులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు