Home South Zone Andhra Pradesh దళితుల భూముల కబ్జాపై కలెక్టరేట్ ఎదుట బహుజన సేన ధర్నా.

దళితుల భూముల కబ్జాపై కలెక్టరేట్ ఎదుట బహుజన సేన ధర్నా.

0

నిమ్మనపల్లె మండలంలో దళితుల భూములను అక్రమంగా కబ్జా చేశారని ఆరోపిస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట బహుజన సేన ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.

సంఘం అధ్యక్షులు శ్రీ చందు నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో, నిమ్మనపల్లె తహశీల్దార్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి దళితుల భూములను ఇతరులకు కట్టబెట్టారని ఆరోపించారు. అధికారుల అండతోనే ఈ కబ్జాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం స్పందించి దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భూములను కాపాడే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరిస్తూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు

NO COMMENTS

Exit mobile version