Home South Zone Andhra Pradesh పదో తరగతి పరీక్షల్లో గొప్ప విజయం సాధించాలి-డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి

పదో తరగతి పరీక్షల్లో గొప్ప విజయం సాధించాలి-డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి

0

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు ఎటువంటి ఆందోళన,ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి పిలుపునిచ్చారు.
పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఆమె విద్యార్థులకు ఉచితంగా పరీక్ష కిట్లను రైటింగ్ పాడ్,పెన్, పెన్సిల్,స్కేల్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె పలు కీలక సూచనలు చేశారు.

పరీక్షా సమయంలో ఆవేశం చెందకుండా సబ్జెక్టుపై పూర్తి ఏకాగ్రత వహించాలని, ప్రశ్నాపత్రం పఠనం ప్రశ్న పత్రాన్ని ఇచ్చిన వెంటనే కంగారు పడకుండా,ఒకటికి రెండుసార్లు నిదానంగా చదివి అర్థం చేసుకోవాలి.సమయ పాలన పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయం కంటే ముందే చేరుకోవాలి.తెలిసిన ప్రశ్నలకు ముందుగా సమాధానాలు రాయాలి.తుది తనిఖీ సమాధాన పత్రం ఇచ్చే ముందు అన్ని ప్రశ్నలకు నంబర్లు సరిగా వేశామా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి.

తల్లిదండ్రుల పాత్ర ఈ కీలక సమయంలో తల్లిదండ్రులు కూడా పిల్లలపై అనవసర ఒత్తిడి తీసుకురాకుండా, వారికి ఇంట్లో ప్రశాంతమైన సానుకూల వాతావరణాన్ని కల్పించాలని డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి కోరారు. చివరగా, పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ ఆమె ‘ఆల్ ది బెస్ట్’ తెలియజేశారు.

NO COMMENTS

Exit mobile version