అమరజీవి త్యాగం చిరస్మరణీయం: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

0
0

అన్నమయ్య జిల్లా రాయచోటి భాష సంయుక్త రాష్ట్రాల పితామహుడు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమర నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర రవాణా యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఘన నివాళులు అర్పించారు

ఈ సందర్భంగా రాయచోటి పట్టణంలోని డైట్ కళాశాల ఎదురుగా ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నారు ఆయన త్యాగ ఫలితంగానే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు పొట్టి శ్రీరాములు గారి ఆశయాలు త్యాగస్ఫూర్తి భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆ మహానీయుడు సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు