రైతులు పంటలు పండించడానికి రసాయనాలను తగ్గించి భూదేవిని కాపాడుకోవాలని ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు సూచించారు. సోమవారం పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, ఇరికిపెంటలో అగ్రికల్చర్ ఇన్చార్జి శ్రీకాంత్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ, ఈ సంవత్సరం వాతావరణ మార్పుల వల్ల పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరిగి వర్షాలు తక్కువగా పడతాయని, కావున రైతులు నీటిని సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు# కొత్తూరు మురళి.
