మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న పలు అత్యవసర పౌర సమస్యలపై మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి జోనల్ కమిషనర్ సంచిత్‌ను కలిసి చర్చించారు.
ఈ సందర్భంగా కాలనీలలో పెరుగుతున్న దోమల సమస్యపై ఆమె ప్రత్యేకంగా దృష్టి సారించారు.
పలు కాలనీల్లో దోమల సమస్య తీవ్రంగా పెరుగుతోందని, దీనిని నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
ముఖ్యంగా ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించడం, పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేయడం, నిల్వ నీటిని తొలగించడం వంటి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
అదే విధంగా చీకటి ప్రాంతాల్లో ప్రజల భద్రత దృష్ట్యా కొత్త వీధి దీపాలు మరియు వాటికి అవసరమైన పోల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.
భీమ్‌రావ్ నగర్, వాసవి నగర్ ప్రాంతాల్లో ఉన్న పార్కులను రక్షించేందుకు చైన్ లింక్ మెష్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరారు.
దీంతో పార్కుల సంరక్షణ మెరుగుపడటంతో పాటు ప్రజా ఆస్తి రక్షణకు ఉపయోగపడుతుందని తెలిపారు.
అవసరాల దృష్ట్యా కొత్త అంతర్గత రహదారులు మంజూరు చేయాలని, అలాగే ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరుతూ జోనల్ కమిషనర్‌కు అధికారిక వినతి పత్రాన్ని కూడా సమర్పించారు.
ఈ అంశాలపై జోనల్ కమిషనర్ సంచిత్ సానుకూలంగా స్పందిస్తూ, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
#sidhumaroju
Alwal
