Home South Zone Telangana మూడు విడతల్లో రైతు భరోసా.. రైతులకు పండుగ లాంటి వార్త!

మూడు విడతల్లో రైతు భరోసా.. రైతులకు పండుగ లాంటి వార్త!

0

తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని రోజుల నుంచి రైతు భరోసా డబ్బులు పడతాయని భావిస్తున్న రైతులకు ఎట్టకేలకు ఊరట లభించనుంది. ఎన్నికల వాగ్దానంలో భాగంగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం నిధులకు ముహూర్తం ఖరారు చేశారు. ఈనెల 22వ తేదీన విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా ప్రణాళిక వేసింది.ఈ కార్యక్రమాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించనున్నారు. ఆయనే బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి తొలి విడత డబ్బులు వేయనున్నారు. దీంతో తొలి విడత నిధుల విడుదల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతుల ఖాతాల్లో డబ్బులు నేరుగా జమ కానున్నాయి.

‎గత కొంతకాలంగా రైతులు ఎంతో ఆశగా ఈ నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పథకం ప్రారంభాన్ని సీఎం రేవంత్ రెడ్డి సిద్ధిపేట జిల్లా నర్మెట్ట నుంచి నిధులను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో రైతు భరోసా డబ్బుల కోసం సీఎం రేవంత్ రెడ్డి.. ఆర్థికశాఖ, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మలతో చర్చించారు. అనంతరం ఈ నెల 22న రైతు భరోసా నిధులు విడుదలకు ఫిక్స్ అయ్యారు.

అయితే ఈ భరోసా డబ్బులు మూడు విడతల్లో రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి.రైతు భరోసా డబ్బులు మొదటి విడతలో ఈనెల 22న స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వేస్తారు. తొలి విడతలో సుమారు 70 లక్షల మంది రైతులకు డబ్బులు వారి వారి అకౌంట్లలలో జమ కానున్నాయి. ఎకరం వరకు రూ.3,590 కోట్ల నగదును రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. మొదటి విడత డబ్బులు పడిన 20 రోజుల తర్వాత రెండో విడత డబ్బులు జమ చేస్తారు. రెండో విడతలో రూ.2,650 కోట్ల నిధులు విడుదల చేస్తారు. ఆ తర్వాత మూడో విడత డబ్బులు ఏప్రిల్ నెలాఖరును రైతుల ఖాతాల్లో చేరనున్నాయి. ఈ క్రమంలో మొత్తం మూడు విడతల్లో కలిపి మొత్తం రూ.9 వేల కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.






NO COMMENTS

Exit mobile version