Home South Zone Andhra Pradesh మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. ఎమ్మెల్యే షాజహాన్ భాషా.

మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. ఎమ్మెల్యే షాజహాన్ భాషా.

0

మదనపల్లె పట్టణంలోని ఎన్‌. వి. ఆర్‌ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ప్రసాద్ బాబు, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస దీక్ష విరమించిన అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ, రంజాన్ పండుగ శాంతికి, సోదరభావానికి చిహ్నమని పేర్కొన్నారు. ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని, మత సామరస్యాన్ని కాపాడటంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.

NO COMMENTS

Exit mobile version