అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం రామాపురం మండలంలో నూతనంగా నిర్మించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర రవాణా యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యాలయం ప్రజలకు చేరువుగా ఉంటే ప్రజాసేవ కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు
ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడంలో ఈ కార్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి పేర్కొన్నారు పార్టీ కార్యకర్తలకు సమన్వయం కోసం ఈ కార్యాలయం ఒక వేదికగా నిలుస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పార్టీ నాయకుడు కార్యకర్తలు అభిమానులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
