రొంపిచర్ల మండలం పెద్దమల్లెల గ్రామ సచివాలయంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాజకుమార్, పీలేరు నుంచి రొంపిచర్లకు బైకుపై వెళ్తుండగా ఎర్రగుంటపల్లి వద్ద స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పి కిందపడిపోయారు.
ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజకుమార్ కోమాలో ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు# కొత్తూరు మురళి.










