అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా వచ్చే అర్జీలను పెండింగ్లో ఉంచకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
సోమవారం మదనపల్లె కలెక్టరేట్లో జరిగిన PGRS కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని ప్రజల నుంచి 346 అర్జీలను స్వీకరించారు. ముఖ్యమంత్రి స్థాయిలో PGRS అర్జీలపై సమీక్షలు జరుగుతున్నాయని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు.










