అమరజీవి త్యాగస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం: కలెక్టర్.

0
1

ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం వెలకట్టలేనిదని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. సోమవారం, పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించిన 58 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జిల్లా అధికారులు వర్చువల్‌గా వీక్షించారు