Home South Zone Andhra Pradesh దేశాయిపేట వద్ద రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

దేశాయిపేట వద్ద రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

0

చీరాల: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పరిధిలోని దేశాయిపేటలో ఆమోదగిరి పట్నం మార్కెట్ ఎదుట సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రోడ్డు దాటుతున్న వ్యక్తి అకస్మాత్తుగా ముందుకు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.

గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది.

#Narendra

NO COMMENTS

Exit mobile version