కిర్లంపూడి మండలం వేలంక గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంతో అధ్వానంగా తయారయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే నరకప్రాయంగా ఉందని , ఆటో డ్రైవర్లు కూడా గ్రామానికి రావడానికి నిరాకరిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.
అత్యవసర సమయంలో ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని , అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులు ప్రారంభించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
