మంచిర్యాల: వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ
మంచిర్యాల పట్టణంలోని హైటెక్ సిటీ కాలనీకి చెందిన బండారు విజయలక్ష్మి బెల్లంపల్లి చౌరస్తా నుంచి ఆటోలో ఇంటికి వెళ్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలోని గొలుసును దొంగిలించారు. హైటెక్ సిటీ కాలనీ వద్ద ఆటో దిగి చూసుకునేసరికి గొలుసు కనిపించలేదు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రమోద్ రావు తెలిపారు.
