Home South Zone Andhra Pradesh బాపట్ల పోలీస్ ప్రత్యేక డ్రైవ్.. 3 నెలల్లో రూ. 1.61 కోట్ల విలువైన 806 ఫోన్ల...

బాపట్ల పోలీస్ ప్రత్యేక డ్రైవ్.. 3 నెలల్లో రూ. 1.61 కోట్ల విలువైన 806 ఫోన్ల రికవరీ.

0

బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం “మొబైల్ రికవరీ మేళా” నిర్వహించారు. ఫిబ్రవరి 2026 నెలలో ఐటీ కోర్ బృందం సాంకేతిక పరిజ్ఞానంతో రికవరీ చేసిన రూ. 40.20 లక్షల విలువైన 201 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు.

గత మూడు నెలల్లో మొత్తం రూ. 1.61 కోట్ల విలువైన 806 ఫోన్లను రికవరీ చేయడం విశేషం. ఫోన్లు పోగొట్టుకున్న వారు CEIR పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని, సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. పోయిన ఫోన్లు తిరిగి రావడంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

#Narendra

NO COMMENTS

Exit mobile version