మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్లారెడ్డి కాలనీలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలపై స్థానిక నివాసితులు చేసిన ఫిర్యాదుల మేరకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.
ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఆమె కాలనీలో పర్యటించి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.
పర్యటన సమయంలో కాలనీ వాసులు భారీ వాహన రాకపోకల వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేకంగా, చంద్రపురం కాలనీ ద్వారా వెళ్లే ప్రత్యామ్నాయ రహదారిని శుభ్రపరచి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
ఈ మార్గం అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.
నివాసితుల ఇబ్బందులను త్వరలోనే పరిష్కరిస్తానని శాంతి శ్రీనివాస్ రెడ్డి కాలనీవాసులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal
Home South Zone Telangana “మల్లారెడ్డి కాలనీలో ట్రాఫిక్ పరిష్కారానికి చర్యలు – ప్రత్యామ్నాయ రోడ్‌పై చర్చ”









