రామయంపేట మండలంలో బుధవారం నిర్వహించిన పదో తరగతి హిందీ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయని తహసిల్దార్ రజని కుమారి తెలిపారు.
మండలంలోని ఐదు కేంద్రాల్లో మొత్తం 816 మంది విద్యార్థులకు గాను అందరు హాజరయ్యారని ఒక్కరు కూడా గైర్హాజరు కాలేదని పేర్కొన్నారు.100% హాజరు నమోదు తో ఆమె హర్షం వ్యక్తం చేశారు.
