సికింద్రాబాద్ : బోయిన్పల్లి సెంటర్ పాయింట్ వద్ద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ‘స్పెక్ట్స్ వేర్’ అనే కళ్లజోళ్ల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మంటలతో పాటు దట్టమైన పొగ వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ప్రమాదంలో దుకాణంలోని అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మిగిలిన మంటలను పూర్తిగా ఆర్పేందుకు చర్యలు చేపడుతున్నారు.
ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
#Sidhumaroju
Alwal










