ఎమ్మిగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర @2047 – బడ్జెట్ 2026-27 అవుట్‌రీచ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధిని వేగవంతం చేయడానికి రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం మరియు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం అవసరమైన నిధులను సమకూర్చేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని, అభివృద్ధి పనులకు ప్రాధాన్యత కల్పిస్తూ మరిన్ని ప్రాజెక్టులను తీసుకురావడానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. స్వర్ణ ఆంధ్ర లక్ష్య సాధనలో ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి (PD), మూడు మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్, టీడీపీ మండల మరియు పట్టణ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.










