టీడీపీ నాయకులు డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు.

0
3

గురువారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టీడీపీ రాష్ట్ర సీనియర్ యువ నాయకులు కట్ట దొరస్వామి నాయుడు, డీఎస్పీ పావనిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గానికి సంబంధించిన ప్రజా సమస్యలు, శాంతిభద్రతల పరిరక్షణపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని వారు డీఎస్పీని కోరారు.