మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం నియోజకవర్గంలో సీఎం సహాయనిధి లబ్ధిదారులకు చెక్కులను స్వయంగా అందజేశారు. వడ్డిపల్లికి చెందిన లక్ష్మీదేవికి రూ. 51 వేలు,
సుమిత్రకు రూ. 1, 71,000 అందించారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ. 7 కోట్లకు పైగా సీఎం సహాయనిధి పంపిణీ చేశామని, తాజాగా రూ. 2.23 లక్షలు అందించామని ఆయన తెలిపారు. ఈ నిధి నిరుపేదలకు వరమని ఆయన అభివర్ణించారు.









