మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : శ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలతో అల్వాల్ ఐజి సర్కిల్ పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ అవలంభించిన వ్యతిరేక విధానాన్ని ఖండిస్తూ, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం బీజేపీ నాయకులు చేశారు.
అల్వాల్ సర్కిల్లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మహిళల గౌరవం, హక్కులు మరియు రాజకీయాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంపొందించే చారిత్రక నిర్ణయాన్ని అడ్డుకునే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, మహిళల సాధికారతను అణగదొక్కే రాజకీయాలకు ఇది గట్టి హెచ్చరిక అని స్పష్టం చేశారు. మహిళల అభివృద్ధి, గౌరవం కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి అల్వాల్ సర్కిల్‌కు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు విశేషంగా హాజరై మహిళా బిల్లుకు తమ మద్దతును ప్రకటించారు.
#sidhumaroju
Alwal










