జగిత్యాల జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగ్రరూపం దాల్చారు. కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరిన జీవన్ రెడ్డిపై నిప్పులు చెరుగుతూ, పదవి కోసం 40 ఏళ్ల అనుబంధాన్ని కాలదన్నారని విమర్శించారు.
ఓడిపోయినప్పటికీ ఎంపీ టికెట్ ఇచ్చి గౌరవించినా, స్వార్థంతో శత్రువులతో చేతులు కలిపారని మండిపడ్డారు. అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి వస్తే జీవన్ రెడ్డి ఓర్వలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రజా పాలనను కూల్చాలని చూస్తున్న ‘పాపాల భైరవుడి’ పక్షాన నిలిచిన వారిని ప్రజలు క్షమించరని, జగిత్యాల గడ్డపై బీఆర్ఎస్‌ను వంద మీటర్ల లోతులో పాతర వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.










