మదనపల్లి: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత: ఎస్పీ.

0
0

మదనపల్లిలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)లో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రజల ఫిర్యాదులను సోమవారం స్వీకరించారు. కుటుంబ వివాదాలు, సైబర్ నేరాలు, భూ తగాదాలు వంటి సమస్యలపై

అలసత్వం లేకుండా చట్టపరంగా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యంగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని సూచించిన ఎస్పీ, ప్రజలు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని పేర్కొన్నారు.